ఎయిర్ పోర్టు భూసేకరణ వేగవంతం చేయాలి..
Ens Balu
2
Vizianagaram
2021-09-21 11:18:01
విజయనగరం జిల్లాలోని భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణానికి సంబంధించిన భూ సేకరణ ప్రక్రియపై జాయింట్ కలెక్టర్ జి.సి. కిశోర్ కుమార్ మంగళవారం తన ఛాంబర్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రక్రియను వేగవంతం చేయాలని, సాంకేతిక ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అవార్డు అయిన భూములకు సంబంధించి అంగీకారం తీసుకొని సంబంధిత బకాయిలు చెల్లించాలని సూచించారు. వివాదాలు ఉన్నటువంటి స్థలాల్లో రీ సర్వే చేయించి పరిస్థితిని చక్కదిద్దాలని చెప్పారు. ఎ. రావివలస, గూడెపువలస ప్రాంతాల్లో భూసేకరణలో ఉన్న సమస్యలను జేసీ ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. అలాగే కోర్టు కేసుల్లో ఉన్న భూముల గురించి ఆరా తీశారు. సర్వే, రెవెన్యూ అధికారులు సమన్వయంతో వ్యవహరించి భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో ఆర్డీవో బీహెచ్ భవానీ శంకర్, కె.ఆర్.ఆర్.సి. ఎస్‌డీసీ పద్మావతి, డీటీలు, సర్వే విభాగ అధికారులు తదితరులు పాల్గొన్నారు.