తూ.గో.జి.లో మళ్లీ 144 సెక్షన్ అమలు..


Ens Balu
2
Kakinada
2021-09-21 11:27:50

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల కనుగుణంగా కోవిడ్-19 నియంత్రణ చర్యలలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఈ నెల 30వ తేదీ వరకూ రాత్రి 11 గంటల నుండి ఉదయం 6 గంటల వరకూ 144 సెక్షన్ అమలుకు జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ ఉత్తర్వులు జారీ చేశారు.  ఈ మేరకు కర్ఫ్యూ సమయంలో ఆరుబయట వ్యక్తుల సంచారాన్ని నిషేదిస్తూ,  ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ లాబ్ లు, ఫార్మసీలు, అత్యవసర సేవలు అందించే సంస్థలు మినహా, మిగిలిన అన్ని షాపులు, సంస్థలు, కార్యాలయాలను విధిగా మూసివేయాలని ఆదేశించారు. అలాగే ఏదేని ప్రదేశంలో 5గురు కంటే ఎక్కువ వ్యక్తులు గుమిగూడ రాదని తెలిపారు.  ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ 2005, ఐపిసి-188 సెక్షన్ ల క్రింద చర్యలు చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.