పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం..
Ens Balu
4
Srikakulam
2021-09-21 12:12:01
పౌష్టికాహారం తోనే ఆరోగ్యం సిద్ధిస్తుందని ఏపీ సాంఘిక సంక్షేమ గురుకులం జిల్లా కన్వీనర్ వై.యశోద లక్ష్మి అన్నారు. పెద్దపాడు సాంఘిక సంక్షేమ గురుకులంలో పోషణ అభియాన్ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యశోద లక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్నారులకు పోషకాహారం అవసరమని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై దృష్టి పెట్టి గర్భంలో ఉన్నప్పటి నుండే మంచి ఆహారం అందించుటకు కృషి చేస్తున్నాయని అన్నారు. చిన్నారులు అన్ని కూరగాయలు తీసుకోవాలని తద్వారా ఆరోగ్యం లభిస్తుందని చెప్పారు. సీజనల్ గా వచ్చే పండ్లు, కూరగాయలు, స్థానికంగా లభించే ఆహార పదార్థాలు తీసుకోవడం వలన ఆరోగ్య పరిస్థితులు మెండుగా ఉంటాయని ఆమె పేర్కొన్నారు. విద్యార్థులు పౌష్టికాహారం పొందటం వలన శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కలిగి ఉంటారని మెదడు చురుగ్గా పని చేస్తుందని వివరించారు. పోషన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలను నిర్వహించారు. కూరగాయలు, పండ్లు, ఆహారపదార్థాలతో పౌష్ఠిాహార ప్రదర్శన నిర్వహిస్తూ మంచి ఆహారం తీసుకునే విధానాలు వివరించారు.