7రోజుల్లో 87వేల మందికి కోవిడ్ వేక్సినేషన్..
Ens Balu
1
Vizianagaram
2021-09-21 12:28:06
విజయనగరం జిల్లాలో సోమ, మంగళవారాల్లో చేపట్టిన కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌కు మంచి స్పందన వచ్చిందని జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి వెల్లడించారు. 18 ఏళ్లకు పైబడిన వారిలో మొదటి డోసు శతశాతం పూర్తిచేయాలని, రెండో డోసు గడువు సమీపించిన వారికి ఇవ్వాలనే లక్ష్యంతో ప్రత్యేక డ్రైవ్ చేపట్టామన్నారు. రెండు రోజుల్లో జిల్లాలో 87 వేల మందికి వ్యాక్సిన్ వేయడం జరిగిందని పేర్కొన్నారు. సోమవారం 66,599 మందికి, మంగళవారం సాయంత్రం సమయానికి 20వేల మందికి వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు. వ్యాక్సిన్ వేసుకొనేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. వ్యాక్సినేషన్ డ్రైవ్ విజయవంతం చేయడంలో కృషిచేసిన వలంటీర్లు, ఆశ కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది, వైద్యాధికారులు, ఎంపిడిఓలు, సచివాలయ సిబ్బంది అందరికీ కలెక్టర్ అభినందనలు తెలిపారు.