జీవివనరులు అంతరించిపోకుండా చూడాలి..


Ens Balu
2
Chittoor
2021-09-22 07:59:07

గ్రామీణ ప్రాంతాలలో జీవ వైవిద్యాన్ని కాపాడేందుకు గ్రామ స్థాయిలో నియమించబడిన కమిటీ లు పూర్తి స్థాయిలో పనిచేసి జీవవనరులు అంతరించిపోకుండా  ప్రజలలో అవగాహన కల్పించాలని రాష్ట్ర అటవీ శాఖ ప్రిన్సిపుల్ చీఫ్ కంజర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, ఆంధ్ర ప్రదేశ్ జీవ వైవిద్య బోర్డు కార్యదర్శి నలినీమోహన్ అన్నారు. చిత్తూరులో బుధవారం ఆయన జీవవైవిద్యాన్ని కాపాడేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఎన్ జి ఓ లు, ఇతర ఔత్సాహిక వ్యక్తుల తో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవ వైవిద్యాన్ని సమతుల్యత చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా కృషి చేస్తోందని, 2002 లో ఏర్పాటైన బోర్డు 2006 లో కార్యకలాపాలను ప్రారంభించిందని, క్షేత్ర స్థాయి నుండి జీవ వైవిద్యాన్ని కాపాడేందుకు జీవ వనరులను ఏ విధంగా పెంచుకోవాలని అందుకు చేపట్టాల్సిన చర్యల గురించి స్వయం ప్రతిపత్తి కలిగిన బోర్డు గా ఏర్పాటు కావడం జరిగిందని, ప్రభుత్వ ఆశయాలను అమలు చేస్తూ స్థానిక ఎన్ జి ఓ ల సహాయం తో స్వచ్ఛంధ సేవకు వచ్చిన సామాజిక స్పృహ ఉన్న వారితో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతోందని అన్నారు. రోగ నిరోధక శక్తి పెంచేందుకు చిరు ధాన్యాలు ఎంత అవసరమో, వ్యక్తి ఆరోగ్యం గా ఉండడానికి ఔషధ మొక్కలు ఎంతో అవసరం అని, ఈ ఔషధ మొక్కలు పెంచడానికి గ్రామీణ ప్రాంతాలలో, మున్సిపాలిటీ లలో అవగాహన కల్పించాలని అన్నారు. ఈ జీవ వైవిద్య మండలి ప్రభుత్వానికి సలహా ఇస్తూ జీవ వైవిద్యానికి అటవీ ప్రాంతాలలో పాటుపడుతున్నామో అదే విధంగా మానవులు ఉన్న ప్రాంతాలలో పెంచడానికి వారిలో అవగాహన కల్పించడానికి కృషి చేస్తామన్నారు. చెట్లు మొక్కలు పెరగడానికి సూక్ష్మ జీవులు ఏ విధంగా అవసరమో ఆ సూక్ష్మ జీవులు పెరగానికి చెట్లు కూడా అంతే అవసరమని, ఎరువులు క్రిమి సంహారక మందులు లేని ఆరోగ్యవంతమైన సమాజాన్ని నెలకొల్పడమే ప్రధాన లక్ష్యమని, ఆరోగ్య విలువలు కలిగిన ఆహార పధార్థాలను పండించి మానవుని జీవితాన్ని మరింత పెంచేందుకు ఉపయోగపడాలన్నారు. జిల్లా స్థాయిలో జెడ్ పి ఛైర్మన్, సి ఇ ఓ, ఇతర అధికారు, అనధికారులతో కమిటీ ఉంటుందని, కలెక్టర్ కొన్ని చోట్ల ఛైర్మన్ గా ఉంటారని టెక్నికల్ సపోర్ట్ మాత్రమే ఇవ్వడం జరుగుతుందని అన్నారు. మండలస్థాయిలో ఎంపిడిఓలు, తహశీల్దార్లు, గ్రామీణ స్థాయిలో గ్రామ సచివాలయ సిబ్బంది, సర్పంచ్ ఛైర్మన్ లు గా ఉంటారని, అందరూ వనరులు అంతరించి పోకుండా జీవ వనరులను పెంపొందించే మొక్కలు, పశువులు, సూక్ష్మ జీవులు, వృక్షాలను పెంపొందించి జీవ వైవిద్యాన్ని కాపాడేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. ఈ కార్యక్రమం లో సోషల్ ఫారెస్ట్ డి ఎఫ్ ఓ సోమ శేఖర్ తో పాటు పలువురు జిల్లా అధికారులు స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.  అంతకు మునుపు జీవవైవిద్య కార్యదర్శి వాణిమోహన్ జిల్లా కలెక్టర్ ఎం .హరినారాయణన్ ను  కలెక్టర్ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిశారు.