విజయనగరం జిల్లాలో షెడ్యూల్డ్ కులాల సంక్షేమ కమిటీ ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకూ జిల్లాలో పర్యటిస్తుందని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి తెలిపారు. ఈ కమిటీ పర్యటనకు సాంఘిక సంక్షేమశాఖ డిప్యుటీ డైరెక్టర్ కె.సునీల్‌రాజ్‌కుమార్ ని నోడల్ ఆఫీసర్‌గా నియమించారు. 28వ తేదీ ఉదయం 4.40 గంటలకి కమిటీ సభ్యులు జిల్లాకు చేరుకొని, 10 గంటలకు నిర్వహించే సమావేశంలో రోస్టర్ పాయింట్లు, రిజిష్టర్లు తనిఖీ చేస్తారు. 29వ తేదీన ఉదయం 10 గంటలకు ప్రజలవద్దనుంచి, వివిధ సంఘాల నుంచి వినతులను స్వీకరిస్తారు. మధ్యాహ్నం 2 గంటలనుంచి సాంఘిక సంక్షేమ వసతి గృహాలను సందర్శిస్తారు. 30వ తేదీ 10.30 గంటలకు శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ కార్యనిర్వహణాధికారితో సమావేశం నిర్వహించి, దేవస్థానం ఉద్యోగ నియామకాల్లో ఎస్‌సి రిజర్వేషన్లు పాటించిందీ లేనిదీ పరిశీలిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు కలెక్టరాఫీసులో, జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో సమావేశాన్ని నిర్వహిస్తారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఎస్‌సిల రిజర్వేషన్లు అమలు, సంక్షేమ కార్యక్రమాల అమలుపై సమీక్షిస్తారు. రాత్రి సుమారు 9.20 గంటలకి జిల్లా నుంచి బయలుదేరి, విజయవాడ వెళ్తారని వివరించారు.