డ్రైనేజీల్లో బాటిల్స్, చెత్త వేస్తే కఠిన చర్యలు..
Ens Balu
2
Simhachalam
2021-09-23 08:24:18
సింహగిరిపైనున్న డ్రైనేజీల్లో వాటర్ బాటిల్స్, చెత్త చెదారం, ప్లాస్టిక్ వేస్తే కఠన చర్యలు తీసుకుంటామని షాపులనిర్వాహకులు ఈఓ ఎంవీ సూర్యకళ హెచ్చరించారు. గురువారం సింహరిపై డ్రేనేజీలు పరిశుభ్రతను ఆమె పరిశీలించారు. కొన్ని షాపుల వద్ద చెత్తను ఉండటాన్ని ఆమె గమనించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ, షాపుల నిర్వహాకులు చెత్త డంప్ చేస్తే లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని హెచ్చరించారు. షాపు నుంచి వచ్చిన చెత్తా చెదారాన్ని డస్టు బిన్స్ ఏర్పాటుచేసుకుని వారే కిందకి తీసుకెళ్లాలని చెప్పారు. డ్రైనేజీల్లో కవర్లు, ప్లాస్టిక్ , చెత్త ఉండటాన్ని ఆమె చూశారు. కొంతమంది బల్క్ గా చెత్త డప్ చేస్తున్నారన్న నిర్దారణకు వచ్చారు. షాపులవారితోనూ మాట్లాడారు. ఇకపై సీసీ కెమెరాలు చూసి మరీ చర్యలు తీసుకుంటానన్నారు. ఆలయ పరిసరాల్లో, కొండపైన శుచి శుభ్రత పాటించాలని..ఈ సందర్భంగా శుభ్రత, పరిశుభ్రత విషయంలో గాంధీ మహాత్ముని సూక్తిని అందరికీ గుర్తు చేశారు.