జర్నలిస్టుల సంక్షేమ బాధ్యత ప్రభుత్వాలదే..
Ens Balu
5
Visakhapatnam
2021-09-24 07:51:55
జర్నలిస్టుల సంక్షేమ బాధ్యత కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలదేనని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సామాజిక ఉద్యమ కారులు బొలిశెట్టి సత్యనారాయణ(సత్య) అన్నారు. శుక్రవారం ఇక్కడి పోర్టు స్డేడియంలో వైజాగ్ జర్నలిస్టుల ఫోరం, సిఎంఆర్, విస్జా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నీ పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ఈసందర్భంగా బోలిశెట్టి మాట్లాడుతూ మూడు దశాబ్ధాలకుపైగా జర్నలిస్టుల సంక్షేమానికి వైజాగ్ జర్నలిస్టుల ఫోరం కృషి చేస్తుందన్నారు.క్రమం తప్పకుండా ఇంటర్ మీడియాతో పాటు రాష్ట్రస్దాయి క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కరోనా విపత్తు సమయంలో జర్నలిస్టులు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత సంబంధిత ప్రభుత్వాలపై ఉందన్నారు. గౌరవ అతిథిగా హాజరైన విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె.రాంబాబు మాట్లాడుతూ విమ్స్‌లో జర్నలిస్టులకు ప్రత్యేకంగా వైద్యసేవలందించడంతో పాటు, వెయ్యి రూపాయాల వరకూ అన్ని రకాల పరీక్షలు ఉచితంగా చేస్తామన్నారు. కొవిడ్ సమయంలో కూడా అధిక సంఖ్యలో జర్నలిస్టులకు స్పెషల్ కేర్ తీసుకుని వైద్యం అందించామని, ప్రస్తుతం విమ్స్‌లో ఆధునాతన వైద్యసేవలందిస్తున్నామన్నారు. పేదల వైద్యులు, లక్ష్మీగాయిత్రి అధినేత డాక్టర్ కాండ్రేగుల రామ్‌కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టులకు తమ వంతు సహయ,సహకారాలు ఎప్పుడూ అందిస్తామన్నారు.విజెఎఫ్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో విజెఎఫ్ అధ్యక్ష,కార్యదర్శులు గంట్ల శ్రీనుబాబు, ఎస్, దుర్గారావులు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా తామ పాలకవర్గం పనిచేస్తుందన్నారు. విద్య, వైద్యంతో పాటు క్రమం తప్పకుండా రాష్ట్ర, జిల్లా స్థాయి ఇంటర్ మీడియా స్పోర్ట్స్ మీట్‌లు నిర్వహించిన ఘనత విజెఎఫ్‌కే దక్కుతుందన్నారు. దేశ వ్యాప్తంగా జర్నలిస్టుల సంక్షేమ సంఘాలకు ఆదర్శవంతంగా విజెఎఫ్ కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. విజెఎఫ్ ఉపాధ్యక్షులు ఆర్.నాగరాజు పట్నాయక్ స్వాగతం పలికిన ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ దాడి రవికుమార్, స్పోర్ట్స్ జర్నలిస్టుల అసోసియేషన్ అధ్యక్షుడు ఉమాశంకర్‌బాబు,నాగబొయిన నాగేశ్వరరావు,పైల భాస్కరరావు సభ్యులు దొండా గిరిబాబు, ఎంఎస్‌ఆర్ ప్రసాద్, ఇరోతి ఈశ్వరరావు, ,పైలా దివాకర్, శేఖర్ మంత్రి తదితరులు పాల్గొన్నారు.