అన్నవరం రత్నగిరి శ్రీశ్రీశ్రీ వీరవెంకట సత్యన్నారాయణ స్వామివారి ప్రసాదం ఇక ప్రయం అయ్యింది. స్వామివారి బంగీప్రసాదం రూ.15 నుంచి 20కి పెంచుతూ పాలకవర్గం ఆమోదం తెలిపిందని ఈఓ వేండ్ర త్రినాధ్ తెలియజేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పెంచిన రేట్లు ఈరోజు నుంచే అమల్లోకి వస్తాయని ఈఓ ప్రకటించారు. ఈ మేరకు అన్ని కౌంటర్ల పెంచిన రేట్లను ప్రదర్శిస్తున్నట్టు ఆయన వివరించారు.భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ముడి సరుకు ధరలు పెరిగిన కారణంగా రాష్ట్ర అధికారుల సూచనల మేరకు పెంచి ట్రస్టుబోర్డులో తీర్మానించినట్టు ఈఓ మీడియాకి వివరించారు.