ట్రస్ట్ బోర్డు సభ్యకార్యదర్శిగా టిటిడి ఈఓ..
Ens Balu
10
Tirumala
2021-09-24 12:23:44
టిటిడి ధర్మకర్తల మండలి సభ్యకార్యదర్శిగా డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి శుక్రవారం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయంలోని బంగారు వాకిలి వద్ద ఉదయం 10.05 గంటలకు టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో బోర్డు సభ్యులకు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, కాఫీ టేబుల్ బుక్‌ను అదనపు ఈఓ అందించారు. ఈ కార్యక్రమంలో టిటిడి జెఈవో సదా భార్గవి, సివిఎస్వో గోపినాథ్ జెట్టి, డెప్యూటీ ఈవోలు రమేష్ బాబు, సుధారాణి, లోకనాథం, పేష్కార్ శ్రీహరి ఇతర అధికారులు పాల్గొన్నారు.