బాదితుల సహాయంలో విశాఖ అర్భన్ తహశీల్దార్ జ్నానవేణి..
Ens Balu
2
Visakhapatnam
2021-09-27 09:19:06
గులాబ్ తుపాను ప్రభావంతో విశాఖలోని ఏఎస్ఆర్ నగర్ ఆశ్రయం పొందుతున్న 25 కుటుంబాలకు అర్భన్ తహశీల్ధార్ జ్నానవేణి సోమవారం అల్పాహారం, ఆహారం దగ్గరుండి అందజేశారు. గత రెండు రోజులు నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు విశాఖలోని కొండవాలు ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా యంత్రాంగం వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి అన్నిరకాల సదుపాయలను అందజేస్తున్నది. వాటిని విశాఖ అర్భన్ తహశీల్దార్ జ్నానవేణి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు ఎవరికి ఎలాంటి అత్యవసర సహాయం కావాల్సి వచ్చినా తక్షణమే చూస్తున్నారు. వారికి మంచినీరు, కొవ్వుత్తులు అందజేశారు. అటు ప్రభుత్వం కూడా తుపాను బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని ప్రకటించడంతో జిల్లా యంత్రాంగం సహాయక కార్యక్రమాల్లో నిమగ్నమైంది.