కాకినాడ స్మార్ట్ సిటీలో కోవిడ్ సర్టిఫికేట్ పొందడిలా..


Ens Balu
2
Kakinada
2021-09-27 10:54:01

కాకినాడ స్మార్ట్ సిటీలో కోవిడ్ సర్టిఫికేట్ ప్రజలకు అందించడానికి ఉచిత టోల్ ఫ్రీ నెంబరు  18004250325 ఏర్పాటు చేశామని నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలియజేశారు. ఈనెంబరుకి ఫోన్ చేసి ఆధార్, ఫోన్ నెంబరు, పేరు వివరాలు తెలియజేస్తే ఆన్ లైన్ సర్టిఫికేట్లు అందించేందుకు అవకాశం వుంటుందన్నారు. ఇపుడు చాలా చోట్ల కోవిడ్ వేక్సినేషన్ సర్టిఫికేట్లు అడుగుతున్న ద్రుష్ట్యా ప్రజల సౌకర్యార్ధం దీనిని అందుబాటులోకి తెచ్చామన్నారు.