ప్రజలను పదే పదే సచివాలయాలకి తిప్పొద్దు..


Ens Balu
3
Anantapur
2021-09-27 10:54:58

పనుల కోసం  సచివాలయంకు వచ్చే ప్రజలను పదే పదే తిప్పొద్దని సిబ్బందికి నగర మేయర్ మహమ్మద్ వసీం సూచించారు. నగరంలోని 45 వ సచివాలయంను సోమవారం మేయర్  ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా సచివాలయంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ పక్రియ ను పరిశీలించారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేసుకునేలా చూడాలని సిబ్బందికి ఆయన సూచించారు. ఈ సందర్భంగా స్థానికులతో మేయర్ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సచివాలయంకు ఏదైనా పనిమీద వస్తే సరిగా స్పందించడం లేదని, అవి కావాలి ఇవి కావాలి అని పదే పదే తిప్పుతారని మేయర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన మేయర్ సిబ్బంది తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు పరిపాలన వేగవంతంగా అందించాలన్న లక్ష్యం తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థ ను తీసుకువచ్చారన్నారు.మీ నిర్లక్ష్యం మూలంగా ఆ వ్యవస్థ కు చెడ్డపేరు వచ్చే పరిస్థితి ఏర్పడిందన్నారు.పని మీద వచ్చే వారికి సంబంధించి ఏదైనా రికార్డులు, పేపర్లు అవసరం అయితే   వాటి వివరాలు ఒకేసారి చెప్పాలని,ఒక్కోసారి ఒక్కొక్కటి అడగడం వల్ల టైమ్ వేస్ట్ తప్పా పనులు ముందుకు సాగవన్నారు.ఇకపై ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చూసుకోవాని మేయర్ సూచించారు.కార్యక్రమంలో  కార్పొరేటర్లు  కమల్ భూషణ్,అనిల్ కుమార్ రెడ్డి లతో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు.