భారత్ బంద్‌కు విశాఖలో జర్నలిస్టుల మద్దతు..
Ens Balu
3
Visakhapatnam
2021-09-27 11:22:01
జాతీయ జర్నలిస్టుల సంఘం, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫేడరేషన్,ఏపీ బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ పిలుపు మేరకు సోమవారం నాటి భారత్ బంద్‌కు వర్కింగ్ జర్నలిస్టుల ఫెడేరేషన్ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి , ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, ఫెడరేషన్ అర్భన్ అధ్యక్షుడు పి.నారాయణ నేతృత్వంలో పలువరు జర్నలిస్టులు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద శాంతియుత ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ కేంద్రం వర్కింగ్ జర్నలిస్టులకు సంబంధించిన నాలుగు చట్టాలను రద్దు చేసిందని, తక్షణమే వాటిని పునరుద్దరించాలని చాలా కాలంగా కోరుతున్నామన్నారు. వర్కింగ్ .జర్నలిస్టులకు సముచిత స్థానం కల్పించాలని, తామంతా కేంద్రాన్ని గత కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నామన్నారు. పార్లమెంట్ కమిటీ నియమించిన నేటి వరకూ జర్నలిస్టులకు న్యాయం జరగలేదున్నారు. తక్షణమే ఆ కమిటీ తన నివేదిక ద్వారా వర్కింగ్ జర్నలిస్టులను ఆదుకోవాలన్నారు. అంతేకాకుండా అనేక కార్మిక చట్టాలను రద్దు చేయడం జరిగిందని, వాటికి కూడా ప్రత్యామ్నయం చూపించాలన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ కార్యవర్గ సభ్యుడు జి.శ్రీనివాసరావు, బ్రాడ్‌కాస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఈరోతి ఈశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు బందర్ శివప్రసాద్,కార్యవర్గ ప్రతినిధులు మధు,కొండలరావు,బొప్పన రమేష్ తదితర ప్రతినిధుల పాల్గొన్నారు.