రెడ్ క్రాస్ సొసైటీకి ఎన్.ఆర్.ఐ. రూ.25వేలు విరాళం..


Ens Balu
3
Vizianagaram
2021-09-27 12:04:40

విజయనగరం జిల్లాలో సుధామై వెల్ఫేర్ అసోసియేషన్  అధ్యక్షులు, ఎన్.ఆర్.ఐ. అయిన సుధాకృష్ణ రెడ్ క్రాస్ సొసైటీకి రూ.25 వేలు విరాళం అందించారు. ఈ మేరకు రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ప్రెసిడెంట్, కలెక్టర్ ఎ.సూర్యకుమారిని కలిసి సోమవారం చెక్ అందజేశారు. ఈ సందర్భంగా ఆర్థిక సాయం  అందించిన సుధాకృష్ణని కలెక్టర్  అభినందించారు. మరింత మంది దాతలు ముందుకు రావడం ద్వారా రెడ్ క్రాస్ ద్వారాఎక్కువ మందికి సేవలు అందించడానికి ఆస్కారం వుంటుందని పేర్కొన్నారు. ఈ  కార్యక్రమంలో జూనియర్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కో - ఆర్డినేటర్ ఎం. రామ్మోహనరావు, తదితరులు పాల్గొన్నారు.