అక్టోబరు 1 నుంచి గాలికుంటు వ్యాధికి వ్యాక్సిన్లు..


Ens Balu
4
Kakinada
2021-09-28 05:32:21

తూర్పుగోదావరి జిల్లాలో పశువుల గాలికుంటు వ్యాధికి అక్టోబరు 1 నుంచి వేక్సిన్లు వేసే కార్యక్రమం చేపట్టనున్నట్టు పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డా.సూర్యప్రకాశరావు తెలియజేశారు. మంగళవారం  ఆయన కాకినాడ తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని 64 మండలాల్లో 8లక్షల 80వేల పశువులకు ఈ వేక్సిన్ అందించనున్నట్టు ఆయన వివరించారు. ఇప్పటికే మండలాల వారీగా ఇండెంట్లు తయారుచేసినట్టు ఆయన మీడియాకి వివరించారు. వాటిని మండల కేంద్రాలకు పంపి అక్టోబరు 1 నుంచి అన్ని గ్రామాల్లో గ్రామ పశుసంవర్ధక సహాయకుల ద్వారా వీటిని పంపిణీ చేస్తామన్నారు.