రిజర్వేషన్ కలిగిన వారికే ప్రత్యేక రైలు ప్రవేశాలు..
                
                
                
                
                
                
                    
                    
                        
                            
                            
                                
Ens Balu
                                 5
                            
                         
                        
                            
వాల్తేరు రైల్వే 
                            2020-09-11 14:21:52
                        
                     
                    
                 
                
                    కేంద్రం ప్రకటించిన అన్ లాక్ 4.0 సడలింపుల్లో భాగంగా సెప్టెంబరు 12 నుంచి అదనపు రైలు సేవలను ప్రకటించిందని ఈస్ట్ కోస్టు రైల్వే, వాల్తేరు డివిజనల్ రైల్వే కమర్షియల్ మేనేజర్  ఏకె త్రిపాఠి చెప్పారు. శుక్రవారం ఆయన విశాఖలోని రైల్ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ, కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా  రిజర్వేషన్ టిక్కెట్లు ఉన్న ప్రయాణీకులకు మాత్రమే అనుమతి కల్పిస్తున్నట్టు చెప్పారు. రైలు ప్రయాణం చేసేవారు ఖచ్చితంగా మాస్కు, ఫేస్ షీల్డులు ధరించాలన్నారు. వీటితోపాటు సామాజిక దూరం పాటిస్తూనే రావాలని, అదేవిధంగా రైలులో కూర్చోవాలని చెప్పారు. ప్రతీస్టేషన్ లో ఎక్కే ప్రయాణీకులకు థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరిగా చేసిన తరువాత మాత్రమే లోనికి అనుమతిస్తారన్న ఆయన ప్రయాణీకులే సొంత దుప్పట్లు తెచ్చుకోవాలని సూచించారు. గమ్యస్థానంలో దిగిన తరువాత కూడా ఆయా రాష్ట్రాలు అమలు చేస్తున్న కోవిడ్ నిబంధనలు పాటించాల్సి వుంటుందన్నారు. కేంద్రం నిర్ధేశించిన ఈ మార్గదర్శకాలను పాటిస్తూ, రైల్వేకి సహకరించడంతోపాటు, కరోనా వైరస్ నియంత్రణలో బాగస్వాములు కావాలని డిసిఎం త్రిపాఠి సూచించారు.