తూర్పుగోదావరి జిల్లాలో గులాబ్ తుపాన్ ఎఫెక్ట్ కాస్త గట్టిగానే కొట్టింది జిల్లాలో 7వేల హెక్టార్లలో వరపంట నీటమునిగినట్టు వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు ఎన్. విజయకుమార్ తెలియజేశారు. మంగళవారం కాకినాడ తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో 2.25 లక్షల హెక్టార్లలో వరి పంట పండుతుండగా ప్రస్తుతం ఏడువేల హెక్టార్ల పంట నీట మునిగిందన్నారు. ప్రస్తుతం పంటచేలో చేరిన నీరుని తొలగించే కార్యక్రమం చేపట్టినట్టు ఆయన వివరించారు. రైతులు ఎవరూ ఆందోలన చెందాల్సిన పనిలేదని, గ్రామాలు, మండలాల్లో వ్యవసాయ అధికారులు, సిబ్బంది రైతులకు ప్రభుత్వం ఆదేశాల మేరకు సూచనలు సలహాలు అందజేస్తారని పేర్కొన్నారు.