తూర్పుగోదావరి జిల్లాలో115 ఎకరాల్లో ఉద్యాన పంటలు(అరటి, కర్రపెండలం, కూరగాయలు) నీటమునిగినట్టు ప్రాధమిక అంచనా వేసిసట్టు హార్టికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ రామ్మోహన్ తెలియజేశారు. ఈ మేరకు మంగళవారం తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గులాబ్ తుపాను ఉద్యాన పంటలపై ప్రభావం చూపిందన్నారు. వర్షాలు ఇంకా కొనసాగుతున్నందున ముంపు పెరిగే అవకాశాలున్నాయన్నారు. వర్షాలు తగ్గిన తరువాత పూర్తిస్థాయి విచారణ చేపట్టనున్నట్టు ఆయన మీడియాకి వివరించారు. ఏఏ మండలాల్లో పంట ముంపు జరిగిందో అక్కడ గ్రామీణ ఉద్యాన సహాయకులు, అధికారులతో విచారణ చేపట్టనున్నట్టు ఆయన చెప్పారు.