కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీ.ఎం.ఆర్) సరఫరాను వేగవంతం చేసి నిర్దేశించిన లక్ష్యాన్ని గడువులోపు పూర్తిచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా. జి.లక్ష్మీశ రైస్ మిల్లర్ల ప్రతినిధులను ఆదేశించారు. మంగళవారం కాకినాడ కలెక్టరేట్ లో సివిల్ సప్లయ్ అధికారులు, జిల్లా రైస్ మిల్లర్ల ప్రతినిధులతో జేసీ లక్ష్మీశ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాలో రబీ సీజన్ సీఎంఆర్ బియ్యాన్ని ఖరీఫ్ సీజన్ ధాన్యం సెకరణ ప్రారంభం కాకముందే పెండింగ్ లో ఉన్న సీఎంఆర్ బియ్యం సరఫరాను త్వరగా పూర్తిచేయాలన్నారు. అదేవిధంగా ఇతర జిల్లాలకు పంపిణీ చేసే మధ్యాహ్న భోజన పథకం, అంగన్వాడీ కేంద్రాలకు ఫోర్ట్ ఫైడ్ బియ్యాన్ని సకాలంలో సరఫరా చేయాలన్నారు. ఎఫ్.సీ.ఐ కి ఇచ్చే బాయిల్డ్ రైస్ పంపిణీ కూడా వేగవంతం చేయాలని జేసీ లక్ష్మీ శ రైస్ మిల్లర్ల ప్రతినిధులకు సూచించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సీఎంఆర్ బియ్యాన్ని
గడువు లోపల పంపిణీ చేసి లక్ష్యాన్ని పూర్తి చేయడం జరుగుతుందని రైస్ మిల్లర్ల ప్రతినిధులు జేసీ కి తెలిపారు. ఈ సమావేశంలో డీఎం సివిల్ సప్లయ్ ఇ. లక్ష్మీరెడ్డి, జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ ద్వారంపూడి వీరభద్ర రెడ్డి, ఇతర రైస్ మిల్లర్ల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.