తుపాను వ్యార్ధాల నీరు నిల్వలేకుండా చూడండి..


Ens Balu
3
Visakhapatnam
2021-09-28 13:51:56

 తుఫాను వర్షాల కారణంగా నీరు నిలిచి రోగాలు ప్రబలకుండా తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున  అధికారులను ఆదేశించారు. మంగళ వారం ఉదయం కలెక్టరు అధికారుల తో  టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భముగా కలక్టరు మాట్లాడుతూ వర్షాల కారణంగా నీరు నిలిచి పోయి పలు వ్యాధులకు కారణమవుతుందని, కాబట్టి నీరునిల్వ ఉండకుండా తగుచర్యలు తీసుకోవాలన్నారు. నీటిని క్లోరినేషన్ గావించాలన్నారు. నీటి ట్యాంకుల ను డ్రై చేయాలని సూచించారు. బుధవారం   డ్రైడే  పాటించాలన్నారు.  బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ట్యాంకుల ను శుభ్ర పరచి డ్రై చేయాలని సూచించారు.  నీరు నిల్వ ఉంటే దోమలు బ్రీడింగ్ జరుగుతుంది కాబట్టి  నిలువ నీటిని తప్పని సరిగా పారబోయించాలన్నారు.  పల్లపు ప్రాంతాల లో  మట్టి, రాళ్ళతో నింపాలన్నారు.  పంచాయితీ సిబ్బంది, ఆశా , ఎ.ఎన్.ఎమ్. లు, గ్రామ సేక్రటేరియట్ సిబ్బంది,, వాలంటీర్లు, పోలీస్ లు, ఇంటింటికి తిరిగి ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు.  డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా తదితర వ్యాదులు ప్రబలకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడా త్రాగు నీటికి ఇబ్బంది లేకుండా క్లోరినేషన్ చేసిన   శుభ్రమైన నీటిని ట్యాంకర్ల తో సరఫరా చేయాలన్నారు. మెడికల్ క్యాంపులు నిర్వహించాలని వైధ్యాధికారులకు సూచించారు.  
కోవిడ్ వ్యాక్సినేషన్ కొనసాగించాలన్నారు. జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) పి.అరుణ్ బాబు,  జి.వి.ఎం .సి. కమిషనర్ జి.సృజన, జిల్లా వైద్యాధికారి డా. సూర్యనారాయణ,  సి.ఇ.ఓ జిల్లా పరిషత్ నాగార్జున సాగర్,  డి.పి. ఒ కృష్ణకుమారి, ఎస్.ఇ, పంచాయితీరాజ్ రవీంద్ర, డ్వామా పిడి సంధీప్ తదితర అధికారులు  టెలి కాన్ఫరెన్స్  లో పాల్గొన్నారు.