యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టండి..


Ens Balu
4
Bheemili
2021-09-28 14:13:12

తుఫాను ప్రభావంతో నష్టపోయిన ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన మెరుగైన చర్యలు తీసుకుని.. ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. గులాబ్ తుఫాను నేపథ్యంలో భీమిలీ నియోజకవర్గ పరిథిలోని నాలుగు వార్డుల్లో తీసుకోవాల్సిన చర్యలపై జీవీఎంసీ, సచివాలయ సిబ్బందితో భీమిలి క్యాంపు కార్యాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నాలుగు వార్డుల్లో కూడా కరెంటు, తాగునీరు సమస్య లేకుండా చూడాలని.  పారిశుద్ధ్య పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో షెల్టర్లు ఏర్పాటు చేసి.. నిర్వాసితులకు భోజన సౌకర్యం కల్పించాలని అన్నారు. తాగునీటి సమస్య లేకుండా పంపుల ద్వారా కానీ.. ట్యాంకర్ల ద్వారా కానీ సరఫరా చేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో వరద నీటిని మోటార్లుతో తోడం చాలాని అన్నారు. ప్రజల సౌకర్యం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 08933229535 ను అందుబాటులో ఉంచాలని అన్నారు. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేవరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మరో 24 గంటలపాటు ప్రజలు, అధికారులు, సచివాలయ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అన్నారు. స్థానికంగా ఉండే సమస్యలను సచివాలయ సిబ్బంది పర్యవేక్షించాలని అన్నారు.  ఇకపై తాను కూడా విధిగా సచివలయాలు సందర్శిస్తానని అన్నారు. నాయకులు, సచివాలయ సిబ్బంది సమన్వయంతో పనిచేసి ప్రజల సమస్యలు తీర్చాలని అన్నారు. ఈ సమావేశంలో జోనల్ కమిషనర్ వెంకటరమణ, తహా సిల్లారు, ఈశ్వరరావు, ఇతర అధికారులు, నియోజకవర్గ ఇంచార్జీ ముత్తంశెట్టి మహేష్, 1వ వార్డు కార్పొరేటర్ అక్కరమాని పద్మావతి రామ్ నాయుడు, సచివాలయ సిబ్బంది, పాల్గొన్నారు.