స్వచ్ఛ సర్వేక్షణ్ 2021కి నివాసిత సంఘాల సహకారం అవసరం


Ens Balu
3
2020-09-11 19:44:37

విశాఖ నగరం మరింత సుందరంగా, స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దడానికి 2021వలో జరుగబోయే స్వచ్ఛ సర్వేక్షణ్ కు నివాసిత సంక్షేమ సంఘాల సహకారం చాలా అవసరమని అదనపు కమిషనర్ డా.వి.సన్యాసి రావు అన్నారు.  జివిఎంసీ కమిషనర్ డా. జి. సృజన ఆదేశాల మేరకు, నగరంలోని నివాసిత సంక్షేమ సంఘాల ప్రతినిధులతో స్వచ్ఛ్ సర్వేక్షన్ -2021 కార్యక్రమాలపై సోమవారం గూగుల్ మీట్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  స్వచ్ఛ సర్వేక్షణ్-2021 సర్వే అంశాలపై స్వచ్ఛ భారత్ మిషన్ విధి విధానాలను రూపొందించినదని చెప్పారు. ముఖ్యంగా నివాసిత సంక్షేమ సంఘాలు చేపట్టవలసిన కార్యక్రమాలపై విశాఖనగరం ఉత్తమ స్థానం సాధించగలదన్న ఆయన దానికి ప్రతీ ఆర్.డబ్ల్యూ.ఏలు సహాయ సహకారాలు అందించాలన్నారు. ప్రతీ వార్డులో తప్పనిసరిగా ప్రతీ ఇంటి నుంచి చెత్త విభజన, సేకరణ జరగాలని, తడి చెత్త నుండి ఎరువును తయారు చేయుటకు సహకరించాలన్నారు. ఈ సంవత్సరం, గార్బేజ్ ఫ్రీ సిటీ 3 - స్టార్ రేటింగ్ వచ్చిందని, జరగబోయే స్వచ్చ సర్వేక్షణ్-2021నకు మన నగరానికి తప్పనిసరిగా 5 - స్టార్ రేటింగ్ రావడానికి ఆర్. డబ్ల్యూఏ. ల సహకారంతో జి.వి.ఎం.సి. కృషి చేస్తుందన్నారు. ఆర్. డబ్ల్యూ.ఏ లు, బల్క్ వేస్ట్ జెనెరేటర్లు తడి చెత్తనుండి ఆన్ సైట్ కంపోస్టింగు తప్పనిసరిగా చెయ్యాలని తెలిపారు. ప్రతీ ఇంటి నుండి చెత్తను సేకరించుటకు 50 రూపాయలు యూజర్ చార్జీలు వసూలు చేస్తుందని అందుకు ఆర్. డబ్ల్యూ.ఏ. లు సహకరించాలన్నారు. ప్రజలు ప్లాస్టిక్ వినియోగానికి స్వస్తి పలకాలని, తద్వారా పర్యావరణాన్ని పరిరక్షించాలని సూచించారు. జరనున్న స్వచ్ఛ సర్వేక్షణ్-2021 ప్రజల భాగస్వామ్యం ముఖ్య భూమికను, స్వచ్ఛ భారత్ మిషన్ ప్రామాణికాలలో ఈ భాగస్వామ్యానికి 1800 మార్కులు ఉంటాయని, సర్వే జరుగుతున్నందుకు బృందానికి ప్రజలు నగర అభివృద్ధి దృష్ట్యా సిటిజెన్ ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని చెప్పారు. 1969 నంబరుకు మిస్డ్ కాల్ ద్వారా, My.Gov. వెబ్ సైట్ ద్వారా, స్వచ్ఛతా యాప్ ద్వారా, అవుట్ బౌండ్ కాల్స్ ద్వారా, సర్వేబృందం అడిగిన ప్రశ్నలకు  సానుకూల సమాధానాలు అందించాలన్నారు.  ఆర్.డబ్ల్యూ.ఏ. లు స్వచ్ఛ సర్వేక్షణ్-2021లో చేపట్టే ప్రచార కార్య క్రమాలు, అవగాహన కార్య క్రమాలు S.B.M. పోర్టల్ (అప్లోడ్) పొందు పర్చాలన్నారు