అక్రమ మద్యం పై చర్యలు తీసుకోవాలి..


Ens Balu
7
Visakhapatnam
2021-10-04 14:53:15

రాష్ట్రంలో అక్రమ మద్యం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ 13 జిల్లాల కలెక్టర్లు ఎస్పీలను ఆదేశించారు.  సోమవారం ఆయన డీజీపీ గౌతమ్ సవాంగ్ తో కలసి  అన్ని జిల్లాల  జిల్లా కలెక్టర్లు ఎస్.పి.లు ఎక్సైజ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంతేకాకుండా రాష్ట్రంలో మద్యం వాడకాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. దిశ యాప్ వాడకాన్ని విస్తృత పరచాలని గంజాయి వంటి వాటిపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. విశాఖపట్నం నుంచి జిల్లా కలెక్టర్  ఏ. మల్లికార్జున వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ గ్రామ సచివాలయ స్థాయిలో దిశా యాప్ పట్ల అందరికీ అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. పోలీసు, ఎక్సైజు, అటవీ శాఖ అధికారులతో కలసి జిల్లాలోని ఏజెన్సీ ఏరియాలో గంజాయి అక్రమ రవాణా పై దాడులు చేయడం, కేసులు పెట్టడం, సాగును గుర్తించి ధ్వంసం చేయడం మొదలైన చర్యలు చేపట్టామని చెప్పారు. పోలీసు సూపరింటెండెంట్ మాట్లాడుతూ అక్రమ మద్యాన్ని తయారు చేస్తున్న, విక్రయిస్తున్న వారిపై కేసులు పెట్టడం, నల్ల బెల్లాన్ని,  బెల్లపు ఊటను  గుర్తించి ధ్వంసం చేస్తున్నట్లు తెలిపారు.ఈ వీడియో కాన్ఫరెన్స్లో విశాఖపట్నం నుండి ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎస్.వి.వి. ఎన్. బాబ్జి రావు, అడిషనల్ ఎస్పీ సతీష్ కుమార్ పాల్గొన్నారు.