పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ..
Ens Balu
8
Visakhapatnam
2021-10-04 14:55:26
విశాఖజిల్లాలో 1వ తేదీన 2022 సంవత్సరానికి సంబంధించిన ఓటర్ల జాబితా ప్రకటించడం జరుగుతుందని డిఆర్వో శ్రీనివాసమూర్తి తెలిపారు. సోమవారం కలెక్టరేట్ లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణలో భాగంగా జిల్లాలో 38 పోలింగ్ కేంద్రాల లొకేషన్ లను మార్చడం జరిగిందని, 12 కేంద్రాలకు సంబంధించి భవనాల పేరు మార్చారని, కొత్తగా ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడం జరుగిందని వారికి వివరించారు. ఈ సమావేశంలో భారత జాతీయ కాంగ్రేస్, బిజెపి, సిపియం, వైయస్సార్ కాంగ్రేస్ పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.