జనసురక్ష పథకాలు అర్హులకి అందాలి..


Ens Balu
7
Srikakulam
2021-10-04 15:08:10

భారత ప్రభుత్వం తలపెట్టిన జన శ్రేయోదాయక ప్రాయోజిత పథకాలు అర్హులైన ప్రతి పౌరునికి అందేలా చర్యలు తీసుకోవాలని లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ జి.వి.బి.డి హరిప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన జారీచేసారు.  ప్రధానమంత్రి జనధన యోజన ( పి.ఎం.జె.డి.వై ), ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పి.ఎం.యస్.బి.వై ), ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన (పి.ఎం.జె.జె.బి.వై ), అటల్ పెన్షన్ యోజన ( ఏ.పి.వై ) మొదలైన జన సురక్ష పథకాలను భారత ప్రభుత్వం అమలుచేస్తుందని, ఈ పథకాలను  అర్హులైన ప్రతి పౌరునకు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు కేంద్ర ఆర్ధిక శాఖ ఆధ్వర్యంలో ఆర్ధిక సేవల విభాగం అన్ని జాతీయ బ్యాంకుల మేనేజింగ్ డైరక్టర్లు, సి.ఇ.ఓలను ఆదేశించినట్లు ఆయన చెప్పారు. అందులో భాగంగా యస్.ఎల్.బి.సి రాష్ట్రంలోని అన్ని జిల్లాల లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్లు, వివిధ బ్యాంకుల ఉన్నత అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించిందని తెలిపారు. ఈ నెల 31వరకు అన్ని బ్యాంకులు  ఈ పథకాలపై క్యాంపులను నిర్వహించి ప్రజలకు తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందని అన్నారు. కావున జిల్లాలోని అన్ని బ్యాంకు బ్రాంచుల్లోని సిబ్బంది, మేనేజర్లు, ఫీల్డ్ సిబ్బంది, బ్యాంకు మిత్రాలు, ఆర్ధిక అక్షరాస్యతా కౌన్సిలర్లు సమిష్టిగా కృషి చేసి జన సురక్ష పథకాలు శతశాతం ప్రతీ పౌరునికి అందేలా చూడాలని ఆయన పిలుపునిచ్చారు.