ఒప్పంద ఉద్యోగులకు అండగా ఉంటాం
Ens Balu
3
Anantapur
2021-10-04 15:12:18
అనంతపురం మున్సిపల్ కార్పోరేషన్ లో ఒప్పంద ఉద్యోగులకు అన్ని విధాలా అండగా ఉంటామని నగర మేయర్ మహమ్మద్ వసీం పేర్కొన్నారు. 60 సంవత్సరాల పైబడి పదవి విరమణ పొందిన 22 మంది ఒప్పంద కార్మికుల కుటుంబీకులకు సోమవారం ఒప్పంద కార్మికులుగా నియామక పత్రాలు అందించారు. కార్యక్రమంలో మేయర్ పాటు డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయ్ భాస్కర్ రెడ్డి, నగర కమిషనర్ పివివిఎస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ అనేక ఏళ్ల పాటు ఒప్పంద కార్మికులుగా సేవలు చేసిన సేవలకు గుర్తింపుగా వారి కుటుంబాలకు తోడుగా ఉండాలన్న భావనతో తిరిగి ఒప్పంద కార్మికులుగా తీసుకోవడం జరిగిందన్నారు.అంకిత భావంతో పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సైఫుల్లా బేగ్,అనీల్ కుమార్ రెడ్డి,బాబా ఫక్రుద్దీన్ ,లీలావతి, రహంతుల్లా బాలంజనేయులు కార్యదర్శి సంగం శ్రీనివాసులు, వైఎస్ఆర్సిపి నాయకులు రాధాకృష్ణ, దాదు, దాదా ఖలందర్ కార్మిక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.