పరిశుభ్రత కోసం తల్లుల్లో అవగాహన పెంచాలి..


Ens Balu
6
Srikakulam
2021-10-05 07:52:48

పరిశుభ్రత కోసం పిల్లలు తమ తల్లుల్లో అవగాహన పరచాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ విద్యార్థులకు సూచించారు.  మంగళవారం స్వేచ్ఛ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభ కార్యక్రమంనకు శ్రీకాకుళంలో ఏవియన్ నగర పాలక సంస్థ ఉన్నత పాఠశాల నుండి హాజరైన అనంతరం పాఠశాల విద్యార్థులతో జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడారు. పాఠశాలలో రన్నింగ్ వాటర్ వస్తుందా లేదా అని అడుగగా రన్నింగ్ వాటర్ వస్తుందని విద్యార్థులు తెలియజేశారు.  గతంలో ఫ్యాన్ లు ఎన్ని ఉన్నాయని కలెక్టర్ విద్యార్థులను అడుగగా కారుణ్య అనే విద్యార్థి మాట్లాడుతూ  గతంలో రూంలో ఒక ఫ్యాన్ మాత్రమే ఉండేదని, ప్రస్తుతం 8 ఫ్యాన్లు ఉన్నాయని కలెక్టర్ కు వివరించారు.  మేఘన అనే విద్యార్థి మాట్లాడుతూ గతంలో పెయింటింగ్ ఉండేది కాదని, ప్రస్తుతం పాఠశాలలో పెయింటింగ్, బాలికలకు, బాలురకు వేరు, వేరుగా మరుగుదొడ్లు ఉన్నాయని తెలిపారు. పాఠశాల నాడు ఎలా ఉందని, ప్రస్తుతం ఎలా ఉందని విద్యార్థులను అడుగగా  నేడు కలెక్టర్ అడుగగా గతంలో కంటే ప్రస్తుతం చాలా బాగుందని విద్యార్థులు తెలిపారు.  పరిశుభ్రత విషయంలో ఎలాంటి సిగ్గు లేకుండా తల్లులకు కూడా పరిశుభ్రత గూర్చి అవగాహన పరచాలన్నారు.  మొదటి నుండి శుభ్రత పాటస్తేనే వ్యాదులకు దూరంగా ఉండొచ్చునని తెలిపారు.  భోజనాలు ఎలా పెడుతున్నారు, మెనూ అమలు చేస్తున్నారా లేదా అని కలెక్టర్ విద్యార్థులను అడుగగా భోజనాలు బాగున్నాయని, మెనూ కూడా అమలు చేస్తున్నారని విద్యార్థులు కలెక్టర్ కు వివరించారు. భోజనాలు పై ఫిర్యాదులు ఏమైనా ఉన్నాయా లేదా అడిగి తెలుసుకున్నారు. దేశంలో ఎన్ని భాషలు ఉన్నాయని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.  వంద రూపాయలు నోటు తీసుకొని నోటుపై ఎన్ని భాషలు ఉన్నాయో చూడాలని విద్యార్థులకు ఆయన సూచించారు.  ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు, ఐసిడిఎస్ పిడి జి.జయదేవి, ఇన్ ఛార్జ్ డిఇఓ జి.పగడాలమ్మ, సమగ్ర శిక్ష అభియాన్ ఏపిసి తిరుమల చైతన్య, పి.ఇందిరామణి, తదితరులు పాల్గొన్నారు.