సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహ(సింహాద్రి అప్పన్న)స్వామివారి నిత్యన్నధాన పథకానికి విశాఖలోని వేపగుంట అప్పన్నపాలెంకు చెందిన కేవీఆర్వీ లక్ష్మీ, కృష్ణారావు దంపతులు ఒక లక్షా నూట పదహారు రూపాయలు (రూ.1,00,116 ) విరాళమిచ్చారు. ఆ మొత్తాన్ని దేవస్థానంలో సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ, తమ పెళ్లిరోజైన ఫిబ్రవరి 24వ తేదీన స్వామివారి సన్నిధిలో అన్నదానం చేయాలని కోరారు. ఉపాధ్యాయ వృత్తిలో సుదీర్ఘకాలం పనిచేసిన తాము రిటైరయ్యామని స్వామివారి దయవల్ల చల్లగా ఉన్నామని లక్ష్మీ, కృష్ణారావు దంపతులు తెలిపారు. అనంతరం స్వామివారి దర్శినం చేసుకోని, కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఆలయ సిబ్బంది స్వామివారి ప్రసాదాలను దాతలకు అందజేశారు.