రైతుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలి..
Ens Balu
4
జె.వెంకటాపురం
2021-10-05 13:06:36
రైతులకు సంబంధించిన ఫిర్యాదులపై, సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని జాయింట్ కలెక్టర్ జె. వెంకటరావు అగ్రికల్చర్ అసిస్టెంట్లను ఆదేశించారు. మంగళవారం ఆయన పాచిపెంట-1, 2 రైతు భరోసా కేంద్రాలను, సాలూరు బీసీ కాలనీ, దేవరవీధిలోని రైతు భరోసా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ అందుతున్న సేవలపై సిబ్బందిని ఆరా తీశారు. ఈ సందర్భంగా వివిధ రికార్డులను పరిశీలించారు. వ్యవసాయ సంబంధిత సమస్యలపై రైతుల వచ్చినప్పుడు వారితో వినయంగా మాట్లాడాలని, వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. విధుల నిర్వహణలో బాధ్యతగా మెలగాలని పేర్కొన్నారు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అందిస్తున్న సేవల గురించి, అమలు చేస్తున్న పథకాల గురించి ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని చెప్పారు. ఆయన వెంట స్థానిక అధికారులు, సచివాలయ ఉద్యోగులు, ఇతర సిబ్బంది ఉన్నారు.