కిశోర బాలికల ఆరోగ్యము, పరిశుభ్రతే లక్ష్యంగా స్వేచ్చ అనే కార్యక్రమాన్ని రూపొందిం చడం జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జనన్మోహన రెడ్డి తెలిపారు. మంగళవారం ఉదయం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి వీడియో కాన్పరెన్స్ ద్వారా ‘స్వేచ్చ’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 7వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదివే బాలికలకు నాణ్యమైన బ్రాండెడ్ నాప్కిన్లు నెలకు 10 చొప్పున సంవత్సరానికి 120 నాప్కిన్లు అందజేసే కార్యక్రమంలో జిల్లా పరిషత్ చంద్రంపాలెం, ఉన్నత పాఠశాల నుంచి పర్యాటక శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టరు డా.ఎ.మల్లిఖార్జున, పార్లమెంటు సభ్యురాలు గొడ్డేటి మాధవి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన రెడ్డి మీకు కావలసిన వాటిని అన్నింటిని అందజేస్తున్నారని, మీరు అందరూ బాగా చదువుకుని దేశ అభివృద్దికి కృషి చేయాలన్నారు. మీ కోసం ‘దిశయాప్’ప్రవేశ పెట్టి బద్రతను కల్పించారన్నారు. జిల్లా కలెక్టరు డా.ఎ.మల్లిఖార్జున మాట్లాడుతూ ‘స్వేచ్చ’కార్యక్రమం ఈ రోజు లాంచింగ్ జరిగిందని, అందరూ వినియోగించి ఆరోగ్యంగా ఉండాలన్నారు. ప్రతి పాఠశాలకు ఈ కార్యక్రమం అమలు నిమిత్తం ఒక ‘స్వేచ్చ’నోడల్ అధికారిని నియమిస్తారని తెలిపారు. పార్లమెంటు సభ్యురాలు గొడ్డేటి మాధవి మాట్లాడుతూ ‘స్వేచ్చ’ఇది ఆడపిల్లలందరికి ఎంతో ఉపయోగపడే కార్యక్రమం అని, మన ముఖ్యమంత్రి ఈ సమస్యను అధిగమించడానికి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. మనం తీసుకునే జాగ్రత్తలు మనం సంతోషంగా ఆరోగ్యంగా ఉంచుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వి.ఎమ్.ఆర్.డి.ఎ ఛైర్ పర్సన్ అక్కరమాని విజయనిర్మల, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ జల్లపల్లి సుభద్ర, జిల్లా విద్యాశాఖాధికారి, ప్రాజెక్టు అధికారి, (స్త్రీ శిశు సంక్షేమ శాఖ,) పలువురు విద్యార్ధినులు పాల్గొన్నారు.