త్వరతగతిన కాలువల్లో పూడిక తీయండి..


Ens Balu
6
అనంతపురం
2021-10-05 14:18:12

అనంతపురం నగర పరిధిలోని కాలువల్లో పూడికతీత చేయకపోవడం వల్ల డ్రైనేజీ నీరు రోడ్డుపైకి వస్తోందని వెంటనే కాలువల్లో పూడికతీత పనులు చేపట్టాలని నగర మేయర్ మహమ్మద్ వసీం ఆదేశించారు. నగరంలోని 37 డివిజన్ లో మంగళవారం మేయర్  స్థానిక కార్పొరేటర్ అనీల్ కుమార్ రెడ్డితో కలసి పర్యటించారు. డివిజన్ పరిధిలో అనేక ప్రాంతాల్లో మురుగునీరు రోడ్డుపైకి వస్తుండటంతో పాటు కాళీ స్థలాలలో ముళ్ల కంపలు పెరిగిపోయి పందులు వస్తుందటమే కాకుండా పారిశుద్ధ్య సమస్యతో దుర్గంధం వస్తోందని స్థానికులు మేయర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన మేయర్ కాలువల శుభ్రతను వెంటనే చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు.అదే విధంగా కాళీ స్థలాల యజమానులకు నోటీసులు జారీ చేసి వాటిని శుభ్రం చేయించేలా చూడాలని సూచించారు. మేయర్ వెంట కార్యక్రమంలో ఈ ఈ రామ్మోహన్ రెడ్డి డి ఈ లు నరసింహులు, రాంప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.