విమానాశ్రయ పర్యావరణం స్వచ్చతకు చర్యలు..


Ens Balu
2
Visakhapatnam
2021-10-06 17:11:52

విమానాశ్రయ పర్యావరణం, పరిసరాలు  పరిశుభ్రంగా  వుండే విధంగా తగిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టరు ఏ.మల్లికార్టున అధికారులను ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్ లో నిర్వహించిన విమానాశ్రయ పర్యావరణ నిర్వహణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐఎన్ఎస్ డేగ, విమానాశ్రయం, పోర్టు, జివియంసి, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు.   విమానాశ్రయం చుట్టుప్రక్కల పరిశుభ్రంగా వుంచాలని, మాంస దుకాణాలు తొలగించాలని, పారిశుధ్యపనులు చేపట్టాలని జివియంసి అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలకు మేఘాద్రిగెడ్డ, కొండగెడ్డల నీరు విమానాశ్రయంలోనికి రాకుండా తగిన నిర్మాణాలు, పూడిక తీత పనులు చేయాలని ఇంజనీరింగ్ అధికారులు చూసుకోవాలన్నారు.  విమానాశ్రయం లోనికి పందులు, కుక్కలు మొదలైనవి చొరబడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.   ఈ సమావేశంలో  విమానాశ్రయ డైరక్టర్ కె.శ్రీనివాసరావు, ఎజియం స్టాలన్ కుమార్, ఐఎన్ఎస్ డేగ అధికారి శశాంక్ గుప్తా, ఆర్డీవో కె.పెంచలకిషోర్, జివియంసి వైద్యాధికారి డాక్టర్ శాస్త్రి, ఈ.ఈ. రత్నరాజు, ఇరిగేషన్ ఎస్.ఈ. కె.ఎస్.కుమార్, పోర్టుట్రస్ట్ ఎస్.ఈ. జి.వి.ఎస్.నారాయణ, హెచ్ పి సి ఎల్ అధికారి కమలేష్ సాహు తదితరులు పాల్గొన్నారు.