టిటిడి ట్రస్టుబోర్డు సభ్యుడిగా జె.రామేశ్వరరావు ..
Ens Balu
7
Tirumala
2021-10-07 04:28:36
తిరుమలతిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులుగా జె.రామేశ్వర రావు గురువారం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయంలోని బంగారు వాకిలి వద్ద టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి జె.రామేశ్వర రావుచే ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వీరికి వేదాశీర్వచనం చేశారు. అనంతరం అదనపు ఈవో శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, కాఫీ టేబుల్ బుక్‌ను అందించారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవోలు రమేష్ బాబు, సుధారాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.