విశాఖ జిల్లాలోనూ మొబైల్ వేక్సిన్ వాహనసేవలు..
Ens Balu
10
Visakhapatnam
2021-10-07 09:18:11
విశాఖ జిల్లాలో అందుబాటులోకి వచ్చిన మొబైల్ వ్యాక్సినేషన్ వాహనాలు (టీకా ఎక్స్ ప్రెస్ లు) సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున జిల్లా ప్రజలకు పిలుపు నిచ్చారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వాహనాలను (టీకా ఎక్స్ ప్రెస్ లు) ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కేర్ ఇండియా సహకారంతో జిల్లాకు 3 టీకా ఎక్స్ ప్రెస్ వాహనాలు అందుబాటులోకి వచ్చాయని, పాడేరు, చింతపల్లి, అరకు ప్రధాన స్థావరాలుగా ఈ వాహనాలు పని చేస్తాయని తెలిపారు. ఈ వాహనాల ద్వారా జిల్లాలోని గిరిజన ప్రాంతాలు, హైరిస్క్ ప్రాంతాలలో వ్యాక్సినేషన్ పెద్ద ఎత్తున అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు మొదటి డోసు, రెండవ డోసు తీసుకోలేని వారితో పాటు 18 సంవత్సరాలు దాటిన వారందరికి కోవిడ్ టీకాలు వేయడం జరుగుతుందన్నారు. వ్యాక్సినేషన్ తక్కువగా అయిన ప్రాంతాలలో మొభైల్ వ్యాక్సనేషన్ ద్వారా ముమ్మరంగా చేపడుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజెషన్ అధికారి డా. ఎస్.జీవనరాణి, మాస్ మీడియా అధికారి జయ ప్రసాద్, రత్నకుమారి, కేర్ ఇండియా ప్రతినిధి సుబ్రమణ్యం, గణాంక అధికారి రామచంద్రరావు తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.