మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి..


Ens Balu
3
Amadalavalasa
2021-10-07 14:24:25

మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని శాసనసభాపతి తమ్మినేని సీతారాం కోరారు. గురు వారం ఆమదాలవలస మార్కెట్ యార్డ్ లో వైయస్సార్ ఆసరా రెండో విడత ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభాపతి తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. వైయస్సార్ ఆసరా రెండో విడత మొత్తాన్ని  డ్వాక్రా మహిళల గ్రూపు సభ్యుల అకౌంట్లో నేరుగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వేయటానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనల నుండి వచ్చిన అద్భుతమైన పథకం ఆసరా అన్నారు. ఈ పథకం గూర్చి గత ఎన్నికల్లో అక్క చెల్లెమ్మలకు  వాగ్దానం చేశారని ఆయన తెలిపారు. పాద యాత్ర లో అగ్రిగోల్డ్ లో నష్టపోయామని జగన్ ను కలిసి బాధలు తెలియజేసిన అక్క, చెల్లమ్మ లకు ప్రభుత్వం అధికారంలోకి వస్తే  మీ నష్టపరిహారాన్ని చెల్లిస్తానని ఆనాడే వాగ్దానం చేశారని చెప్పారు. డ్వాక్రా సంఘాల చెల్లెమ్మలకు, అగ్రిగోల్డ్ బాధితులకు మాట ఇచ్చి నిలబెట్టుకున్న మహోన్నతమైన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వాగ్దానం ఇస్తే దానిని నెరవేర్చుతారని ఆయన చెప్పారు. ఆనాడు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని, ఈనాడు జగన్ మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, ఆర్థిక స్వావలంబన తో అభివృద్ధి చెందాలని స్పీకర్ తమ్మినేని కోరారు. ఈ కార్యక్రమంలో ఆమదాలవలస జెడ్ పి టి సి బెండి గోవిందరావు, బూర్జ ఎంపీపీ కర్ణేన దీప, జెడ్ పి టి సి బెజ్జిపూరపు రామారావు, బుడుమూరు సూర్యారావు, పొందూరు జడ్పిటిసి లోలుగు కాంతారావు, బొడ్డేపల్లి రమేష్ కుమార్, జె జే మోహన్ రావు,  మెప్మ పి డి ఎమ్. కిరణ్ కుమార్, తాహసిల్దార్ పద్మావతి, మున్సిపల్ కమిషనర్ రవి సుధాకర్, ఆమదాలవలస ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు.