రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ వారి అభివృద్దికై ఆర్ధిక చేయూత నందిస్తూ మహిళలను అన్ని రంగాలలో అగ్రస్థానం లో నిలబెడుతున్నదని రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. గురువారం స్థానిక వి.ఎం.ఆర్.డి.ఎ., చిల్డ్రన్ ఎరినాలో రెండవ విడత వై.ఎస్.ఆర్. ఆసరా పథకాన్ని ప్రారంభించారు. ఒంగోలులో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన రెడ్డి రెండవ విడత వై.ఎస్.ఆర్ ఆసరా పథకాన్ని ప్రారంభించగా జిల్లా నుండి వీడియో కాన్పరెన్స్ ద్వారా జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరై కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళా పక్షపాతి అని నామినేటెడ్, డైరక్టర్ తదితర పోస్టులను మహిళలకే కేటాయించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. తన పాదయాత్రలో ఇచ్చిన హామీలను తూ.చ తప్పకుండా పాటిస్తూ మహిళలకు ఆర్ధిక చేయూత నందించి వారు స్వయం శక్తితో నిలబడే విదంగా కృషి చేస్తున్నారన్నారు. గత సంవత్సరం కరోనా లాక్ డౌన్ సమయంలో ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికి తాను ఇచ్చిన మాట ప్రకారం మొదటి విడత వై.ఎస్.ఆర్ ఆసరా పథకాన్ని అమలు చేసారన్నారు. దేశంలో ఎక్కడా లేని విదంగా అత్యదిక టెస్టులు, వ్యాక్సినేషన్ వేసిన ఘనత మన రాష్ట్రానిదే అన్నారు. ఎవరి రికమండేషన్ లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కులమతాలు, పార్టీల కతీతంగా సంక్షేమ పథకాలను పారదర్శకంగా నూటికి నూరు శాతం అందజేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 23 రకాల పథకాలు ప్రస్తుతం అమలు జరుగుతున్నాయన్నారు. ఈ పథకాలు ద్వారా ప్రతి కుటుంబం సంవత్సరానికి 50 వేల నుండి లక్ష రూపాయల వరకు లబ్ది పొందుతున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని విదంగా సంక్షేమ కేలండరును అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి అని కొనియాడారు. ఆడపిల్ల సంరక్షణకై దిశ చట్టాన్ని పెట్టి మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారన్నారు. జగనన్న విద్యాకానుక కిట్ అన్ని ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్నారన్నారు.
జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్టున మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన మాటకు కట్టుబడి మహిళలకు ఆర్ధిక స్వావలంబన కల్పిస్తున్నారన్నారు. రెండవ విడత వై.ఎస్.ఆర్ ఆసరా క్రింద 63,991 ఎస్.హెచ్.జి గ్రూపులకు రూ.470 కోట్లు వారి ఖాతాలలో నేరుగా జమ అవుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా చెక్కును రాష్ట్ర మంత్రితో కలిసి అందజెసారు. నగర మేయర్ గొలగాని హరి వెంకటకుమారి మాట్లాడుతూ జి.వి.ఎం.సి పరిధిలో సుమారు 22వేల పొదుపు సంఘాలు సుమారు రూ 156 కోట్ల ఆర్దిక లబ్ది పొందుతున్నారన్నారు. స్వయం సహాయక సభ్యులు తరుపున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలను తెలియజేసికుంటున్నామన్నారు.
విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎం.వి.వి.సత్యన్నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి అమలు చేస్తున్న నవరత్నాలులో భాగంగా అన్ని వర్గాల మహిళలు, వృద్దులకు పలు సంక్షేమ పథకాలను అందిస్తూ రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండే విదంగా పరిపాలిస్తున్నారని, ఆయన పరిపాలనలో తాను భాగస్వామ్యం అవడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. వి.ఎం.ఆర్.డి.ఎ. చైర్పర్సన్ అక్కరమాని విజయనిర్మల మాట్లాడుతూ మహిళా సంఘాలకు ముందుగానే దసరా పండుగ వచ్చిందని మన ప్రియతమ ముఖ్యమంత్రి మహిళలు అప్పులు బారిన పడకుండా వారిని లక్షాదికారులుగా చేసేందుకు స్వయం శక్తితో ఉపాధి కల్పిస్తున్నారని ఈ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు కన్నబాబురాజు, తిప్పల నాగిరెడ్డి, అధీప్ రాజు, కార్పోరేటర్లు, పలు కార్పోరేషన్ల చైర్మన్ లు, అధిక సంఖ్యలో ఎస్.హెచ్.జి. గ్రూపు సభ్యులు హాజరైయారు.