బంగ్లాదేశ్ సరిహద్దు జలాల్లో చేపలవేట నిషేధం.. ఫిషరీష్ డిడి నిర్మలాకుమారి..


Ens Balu
4
Vizianagaram
2021-10-08 14:20:28

తీరప్రాంత మత్స్యకారులు బంగ్లాదేశ్ సముద్రతీర ప్రాంతంలో అక్టోబరు 4 నుంచి 25వ తేదీ వరకూ చేపల వేటకు వెళ్లకుండా నిషేధించినట్టు మత్స్యశాఖ ఉపసంచాలకులు ఎన్.నిర్మలకుమారి తెలియజేశారు. విజయనగరంలో  శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు.  బంగ్లాదేశ్ ప్రభుత్వం తల్లి హిల్సా(పులస) చేపల సంరక్షణ కోసం మదర్ హిల్సా ప్రొటెక్షన్ క్యాంపైన్ 21 రోజులపాటు నిర్వహిస్తున్నదన్నారు. ఆ సమయంలో అక్కడ చేపల వేట, అమ్మకం, రవాణా అన్ని కార్యకాలపాల పైని నిషేధం విధించిందని తెలియజేశారు. ఆ సమయంలో  మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని ఏపీ మత్స్యశాఖ నుంచి హెచ్చరికలు జారీచేశామన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమించి బంగ్లాదేశ్ సముద్రజాల్లో ప్రవేశించినా, వేట చేపట్టినా అక్కడి నేవి, కోస్ట్ గార్డ్ దళాలు అరెస్టులు చేసి బోట్లను సీజ్ చేయడంతోపాటు, పెనాల్టీలు కూడా విధిస్తారన్నాని హెచ్చరించారు. మత్స్యకారులు ఈ విషయాన్ని గమనించి ఆ ప్రదేశాల్లో చేపల వేటకు వెళ్లకూడదని  ఆమె సూచించారు.