12న విశాఖలో జర్నలిస్టుల దసరా సంబురాలు..
Ens Balu
11
Visakhapatnam
2021-10-09 08:37:10
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ విశాఖ యూనిట్ ఆధ్వర్యంలో ఈ నెల12న దసరా సంబరాలు ఘనంగా నిర్వహించనున్నట్లు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, అర్భన్ యూనిట్ అధ్యక్షులు పి.నారాయణ్‌లు తెలిపారు. ఈ మేరకు శనివారం వైశాఖిజల ఉద్యానవనంలో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ 12వ తేది మంగళవారం ఉదయం అల్పాహరంతో ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు. అనంతరం దసరా ఉత్సవాలను ప్రతిబింబించే రీతిలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఈ సందర్భంగా కవితాగోష్టి, సంగీత విభావరి నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం లక్కీడీప్ కార్యక్రమం జరుగుతుందన్నారు. తదుపరి అతిథుల ప్రసంగాలు, పలువురి కళాకారులకు సత్కారాలు, విందు భోజనం,మిఠాయిల పంపిణీ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. కావున జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. జర్నలిస్టుల సంక్షేమంతో పాటు పండగులు, వనభోజన మహోత్సవ కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో యూనియన్ ఆర్గనైజేంగ్ సెక్రటరీ డి.రవికుమార్,బ్రాడ్‌కాస్ట్ జిల్లా అధ్యక్షుడు ఇరోతి ఈశ్వరరావు, ఎంఎస్‌ఆర్ ప్రసాద్, సంఘం సీనియర్ ప్రతినిధులు చింతా ప్రభాకర్‌రావు,పాత్రుడు, కె.మురళీకృష్ణ, కామన్న, పి.నగేష్‌బాబు, చిన్నా తదితరులు పాల్గొన్నారు.