వడ్లమాని కుటుంభానికి ప్రగాడ సానుభూతి..గంట్ల


Ens Balu
1
Simhachalam
2020-09-12 12:19:03

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి దేవస్థానం  విశ్రాంత అధర్వణ వేద పండితులు, వేద రత్నాకర  బ్రహ్మశ్రీ వడ్లమాని వెంకటేశ్వరశర్మ అవధాని పరమపదించారు. ఇటీవల ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇంటి వద్దనే తుదిశ్వాస విడిచారు. కాశీ పంతులుగా సుపరిచితులైన వడ్లమాని 1976లో సింహాచ లం దేవాలయం అధర్వణ వేద పండితునిగా ఉద్యోగంలో చేరారు. సుమారు నాలుగు దశాబ్దాల పాటు తన వేద పారాయణతో సింహాచలేశునికి సేవలందించారు. ఈయన వద్ద వేద విద్యను నేర్చుకున్న సుమారు 250 విద్యార్థులు  పండితులుగా భారతదేశంలోనే కాక ప్రపంచంలోని వివిధ దేశాలలో మహా పండితుల హోదాల్లో తమ కర్తవ్యాలను నిర్వహిస్తున్నారు.  విశిష్టాద్వైత సిద్దాంత ప్రకాశకులు, పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారి చేత కూడా గురువుగారూ అని పిలిపించుకుని గురువులకే గురువుగా కీర్తించబడ్డ పండితోత్తముడయన.దత్తపీఠం ఆస్థాన విద్వాంసుడిగా,అధర్వవేద రత్నాకరుడిగా, వేదోద్ధార, అధర్వవేదనిధి వంటి అనేక పురస్కారాలను సొంతం చేసుకున్నా నిరాడంబరతే ఆభరణంగా సాధారణ జీవితాన్ని గడిపిన మహోన్నతమైన వ్యక్తిత్వం వడ్లమాని సోతం. వెంకటేశ్వరశర్మ అవధాని మరణం పండిత లోకానికి తీరని లోటని పలువురు నివాళులర్పించారు. వడ్లమాని మరణ వార్త విని శిష్య బృందం కన్నీటి పర్యంతయ్యింది. దేశవ్యాప్తంగా ఉన్న శిష్యులు శనివారం ఆయన అంతిమయాత్రలో పాల్గొనేందుకు తరలివస్తున్నట్లు    సమాచారం. వడ్లమానికి భార్య వున్నారు. విశాఖ పరిసర ప్రాంతాల్లో ఉన్న అనేకమంది పండితులు, శిష్యులు, దేవస్థానం అధికారులు, వైదికులు..జాతీయ జర్నలిస్ట్ ల సంఘం కార్యదర్శి ..వైజాగ్ జర్నలిస్ట్ ల ఫోరమ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు తదితరులు  వడ్లమాని పార్ధీవ దేహాన్ని దర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.
సిఫార్సు