దుర్గమ్మ భక్తులకు లోటు లేకుండా ప్రసాదాలు..


Ens Balu
7
Vijayawada
2021-10-09 10:21:32

శరన్నవరాత్రులకు వచ్చే భక్తులకు ప్రసాదాలకు ఎటువంటి లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి డి. భ్రమరాంబ అన్నారు. బుద్దావారి గుడి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన లడ్డూ తయారీ పాక శాలను శనివారం ఇవో డి. భ్రమరాంబ తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ నవరాత్రులలో అమ్మవారిని దర్శించుకునే భక్తులకు అవసరమైన లడ్డూ ప్రసాదాలను సిద్దం చేస్తున్నామన్నారు. ప్రతి రోజు లక్ష 50 వేల లడ్డూ ప్రసాదాలు తయారీ చేసి భక్తులకు విక్రయిస్తున్నామన్నారు.
నవరాత్రుల్లో 10 రోజులపాటు 15 లక్షల 50 వేల లడ్డూలు భక్తులకు అందించేందుకు తగిన ఏర్పాట్లు చేశామన్నారు. లడ్డూ నాణ్యత, తూకంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. తయారీ కేంద్రంలోని అన్ని విభాగాల్లో కోవిడ్ నిబంధనలను పాటిస్తున్నామన్నారు. నవరాత్రులకు వచ్చే భక్తులకు 11 లడ్డూ విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశామని, వీటిలో ఆరు కనకదుర్గనగర్ , విఎంసి,పున్నమిఘాట్, స్టేట్‌గెస్ట్‌హౌస్, రైల్వే స్టేషన్, ఓంకార్ మలుపు వద్ద ఏర్పాటు చేసి భక్తులకు అందుబాటులో ఉంచామని ఆలయ కార్యనిర్వహణాధికారి డి. భ్రమరాంబ తెలిపారు. తయారీ కేంద్రం తనిఖీలో దేవదాయశాఖ రీజనల్ జాయింట్ కమీషనర్ సాగర్‌బాబు, అసిస్టెంట్ డిఇవో రమేష్‌బాబు తదితరులు ఉన్నారు.
సిఫార్సు