కాకినాడ స్మార్ట్ సిటీకి మరింత గుర్తింపు తీసుకువస్తా..


Ens Balu
8
Kakinada
2021-10-09 10:57:45

కాకినాడ స్మార్ట్ సిటీకి మరింత గుర్తింపు వచ్చే విధంగా క్రుషి చేసి జిల్లా కీర్తిని రాష్ట్రంలోనే ముందువరసలో నిలబెట్టేందుకు శక్తివంచన లేకుండా క్రుషి చేస్తానని స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్‌ అల్లి రాజాబాబు యాదవ్ అన్నారు. శనివారం కాకినాడ కార్పోరేషన్ ఆయన నూతనంగా కాకినాడ ఎంపీ వంగా గీత, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి,  కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సమక్షంలో చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మార్గనిర్దేశకత్వంలో కాకినాడ నగర అభివృద్ధికి పాటుప‌డుతూ రాష్ట్రం, దేశంలో కాకినాడ స్మార్ట్ సిటీకి మంచి గుర్తింపు తీసుకొచ్చేందుకు పాటు పడతానన్నారు. అనంతరం ఉద్యోగులు మర్యాదపూర్వకంగా చైర్మన్ కలిసి పుష్పగుచ్చాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో కుడా ఛైర్‌ప‌ర్స‌న్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.