ఘోషా ఆసుపత్రిని మరింత అభివ్రుద్ధి చేస్తాం..


Ens Balu
3
Visakhapatnam
2021-10-09 11:29:27

విశాఖ నగరంలోవున్న విక్టోరియా (ఘోషా) ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేస్తామని జిల్లా కలెక్టరు ఏ.మల్లికార్జున తెలిపారు.  శనివారం నిర్వహించిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆసుపత్రి చికిత్స కొరకు వచ్చినవారికి ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా వుండాలన్నారు.  ఆసుపత్రిలో చేరిన వారికి స్వంత ఇంటిలో వున్న భావన కలగాలని, చికిత్స అనంతరం ఆనందంగా తిరిగి వెళ్లేలా వైద్య సేవలు అదించాలన్నారు.  నాడునేడు పనుల కింద రూ.100 కోట్లతో చేపట్టిన  నూతన భవనం పూర్తయితే అదనంగా 280 పడకలు అందుబాటులోకి వస్తాయన్నారు.  రూ.80 కోట్లు భవన నిర్మాణానికి, రూ.20 కోట్లు పరికరాలకు కేటాయించినట్లు వెల్లడించారు.  ఓపి వేగవంతం చేసేందుకు మరొక కంప్యూటర్, డేటా ఎంట్రీఆపరేటరు, అవసరమని, రేడియాలజిస్ట్,   అంబులెన్స్ డ్రైవరు కూడా మంజూరు చేయాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ డి.హేమలతాదేవి కోరగా నియామకాలకు అనుమతించారు. రూ.34 లక్షలతో  పరికరాలు కొనుగోలుకు కూడా ఆమోదించినట్లు సూపరింటెండెంట్ తెలిపారు. అంతకు ముందు కలెక్టర్ ఆసుపత్రిలో వార్డులను, వివిధ విభాగాలను పరిశీలించారు.  ఆసుపత్రిలో సౌకర్యాలు ఎలా వున్నాయి, చికిత్స, మందులు సక్రమంగా ఇస్తున్నారా, పరిశుభ్రతల గూర్చి రోగులను అడగారు. సేవలు బాగున్నాయని, ప్రతిరోజూ బెడ్ షీట్స్ మార్చుతున్నారన వారు తెలిపారు.  సరఫరా చేస్తున్న ఆహారం పట్ల కూడా రోగులు సంతృప్తిని వ్యక్తం చేశారు. లేబర్ రూమ్, ఐ.సి.యు. రూమ్స్, లాబొరేటరి, పోస్ట్ నాటల్ వార్డు లను పరిశీలించారు.  సమావేశంలో ఆంధ్రా వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.వి.సుధాకర్, అనదపు డియంఅండ్ హెచ్ వో  డాక్టర్ విజయలక్ష్మి, ఆసుపత్రి సూపరింటెండింట్ డి.హేమలతాదేవి, డి.సి.హెచ్. ప్రకాశరావు, ఏ.పి.ఎమ్.ఐ.సి. ఈ.ఈ. నాయుడు, ఆసుపత్రి ఓ.ఎస్.  విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు