విశాఖజిల్లా నలుచెరగులా ‘దిశ’యాప్..


Ens Balu
5
Visakhapatnam
2021-10-11 06:21:13

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మహిళలు, విద్యార్ధినిలు, గ్రుహిణిల సంరక్షణార్ధం అందుబాటులోకి తీసుకొచ్చిన దిశ యాప్ విశాఖజిల్లా నలు చెరగులా దావానంలా వ్యాప్తి చెందుతుంది. జిల్లా ఎస్పీ డా.బొడ్డేపల్లి క్రిష్ణారావు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లు, గ్రామసచివాలయాల పరిధిలోని 630 మంది మహిళా పోలీసులతో దిశ యాప్ ను జిల్లా అంతటా విస్తరిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 70లక్షల మంది ఈ దిశ యాప్ ని ఇనిస్టాల్ చేసుకోగా ఒక్క విశాఖ రూరల్ జిల్లాలోనే 4లక్షల మందికి పైగా దిశ యాప్ ని ఇనిస్టాల్ చేసుకున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. దిశయాప్ ప్రతీ ఒక్కరి స్మార్ట్ ఫోన్ లో ఉండాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశించడంతో ఇటు అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా ఈ దిశ యాప్  వినియోగం, ఇనిస్టాలేషన్స్ పై ప్రత్యేకంగా మండల, డివజనల్ స్థాయి అధికారులతో ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించి మరీ ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇప్పటికే అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని దిశ ద్విచక్రవాహనాలు, పెట్రోలింగ్ వాహనాలను అందుబాటులో కూడా ఉంచారు. ఏజెన్సీ ప్రాంత మండలాలలో  నెట్ వర్క్ ఉన్న చోట్ల దిశా యాప్ ను డౌన్ లోడ్ చేయించే కార్యక్రమాన్ని గ్రామసచివాలయ సిబ్బంది ముఖ్యంగా మహిళా పోలీసులు చేపడుతున్నారు.  చదువు రాని వారు కూడా  మొబైల్ ను 5 సార్లు షేక్ చేస్తే  ఎస్.ఓ.ఎస్ ఓపెన్ అవుతుందనే విషయాన్ని గిరిజనులకు తెలియజేసి అవగాహన కల్పిస్తున్నారు. దీని ద్వారా వారికి అవసరమైన రక్షణ అందుతుందనే భరోసా కల్పిస్తున్నారు. గత సంవత్సరం నుండి దిశా చట్టం మీద అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుండటం కూడా దిశయాప్ ప్రజల్లోకి త్వరగా వెళ్లడానికా ఆస్కారం ఏర్పడింది.  దీనిని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తున్నది.  ప్రతి ఇంటిలో దిశా యాప్ డౌన్ లోడ్ చేసుకొనే  విదంగా  అవగాహన కలిగించేలా ఆ బాధ్యత అన్ని ప్రభుత్వ శాఖ అధికారులు తీసుకునేలా జిల్లా అధికారులు సైతం క్యాంపైన్లు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు స్వచ్చందంగా ముందుకొచ్చి ఈ దిశ ఎస్ఓఎస్ యాప్ ను ఇనిస్టాల్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం చాలాచోట్ల దిశయాప్ ను పురుషులు సైతం తమ మొబైల్స్ లో ఇనిస్టాల్ చేసుకోవడం ద్వారా ఆపద సమయంలో ఉన్నవారికి సహాయం అందిచడానికి వీలుపడుతుందే జిల్లా పోలీసు సందేశాన్ని ప్రతీఒక్కరూ స్వీకరిస్తున్నారు. ఈ విషయంలో మీడియా ప్రత్యేక పాత్ర పోషించడం, దిశయాప్ పై అవగాహన కార్యక్రమాలను ప్రజల్లోకి వెంటేనే తీసుకెళ్లడంలో తమవంతు బాధ్యతను ప్రదర్శిస్తున్నాయి. ముఖ్యంగా టీవీ, పత్రిక, ఆన్ లైన్ మీడియా కంటే, మొబైల్ న్యూస్ యాప్స్ ద్వారా సత్వరమే ప్రజలకు సమాచారం తెలుస్తున్నది. రాష్ట్రప్రభుత్వం దీనిని పూర్తిస్థాయిలో చట్టంగా మారిస్తే మరిన్ని ఫలితాలు రావడానికి, ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు అన్ని వేళల్లో ఉపయోగపడి.. ఒక రక్షణ కవచంలా మారివుంది. రానున్న రోజుల్లో ప్రతీ ఒక్కరి మొబైల్ లోనూ దిశయాప్ ఒక అత్యవసర వనరుగా ఉపయోగపడి రాష్ట్రప్రభుత్వ ఆశయం, మహిళలకు 24 గంటలూ రక్షణ కల్పించేలా మరింత అభివ్రుద్ధి చెందాలని ఆశిద్దాం..!