సచివాలయ స్పందననూ సద్వినియోగం చేసుకోవాలి..


Ens Balu
8
Kakinada
2021-10-11 07:25:11

కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలు నగరపరిధిలోని వార్డు సచివాలయాల్లో జరిగే స్పందనను సద్వినియోగం చేసుకోవాలని  నగరపాలక సంస్థ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. సోమవారం నగరంలో స్త్రీ శక్తి భవనంలో జరిగిన స్పందనలో ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతీ సచివాలయంలో కూడా రోజూ మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు స్పందన జరుగుతుందన్నారు. మున్సిపల్ కార్యాలయానికి రాలేనివారు సచివాలయంలో సంప్రదించవచ్చనన్నారు. అక్కడ పరిష్కారం లభించని పక్షంలో తమని నేరుగా సంప్రదించాలన్నారు. అదేవిధంగా 18004250325 నెంబరుకు ఫోను చెయ్యడం ద్వారా ఇంటినుంచే స్పందనలో సమస్యని తెలియజేయవచ్చునని కమిషనర్ సూచించారు.