ఆధ్యాత్మిక శక్తులను మిలితం చేసిదే పండుగ..


Ens Balu
7
Visakhapatnam
2021-10-11 08:07:20

భారతదేశంలో జరిగే అన్ని పండుగలు కూడా చెడును విడనాడి మంచిగా ముందుకు సాగాలనే సూచిస్తాయని ప్రజాపిత బ్రహ్మాకుమారీస్‌ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ప్రతినిధి బికె రామేశ్వరి పిలుపునిచ్చారు.  సోమవారం విశాఖ డాబాగార్డెన్స్‌ విజెఎఫ్‌ ప్రెస్‌క్లబ్‌లో బ్రహ్మాకుమారీస్‌, వైజాగ్‌ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బికె రామేశ్వరి మాట్లాడుతూ చెడు గుణాలు, వ్యసనాలు విడిచిపెట్టాలన్నదే నవరాత్రులు సూచిస్తున్నాయన్నారు. అయితే అది ఒక్క రోజులో పూర్తికాకపోయినా తరువాత దశల వారీగా మంచి అలవాటులతో ముందుకు సాగాలన్నారు. పండగలు ఆధ్యాత్మికశక్తులను ఒకే చోట మిలితం చేస్తాయన్నారు. అయా పండుగులను బట్టి ప్రజలు సంప్రదాయాలను పాటిస్తూనే జరుపుకోవడం అనావాయితీగా వస్తుందన్నారు. దసరా నవరాత్రులు అంటేనే చెడుపై మంచి సాధించే విజయాలకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో సింహచలం దేవస్ధానం ప్రత్యేక ఆహ్వానితులు, వైజాగ్‌ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ శరన్నవరాత్రుల్లో ఇచ్చాశక్తి, జ్ఙానశక్తి, క్రియశక్తుల ద్వారా మానవ సంకల్పం నేరవేర్చుకోవచ్చున్నారు. అంతేకాకుండా దసరా నవరాత్రుల్లో  అత్యధిక శాతం ప్రజలు అమ్మవారులను పూజించడం జరుగుతుందన్నారు. మంచి సంకల్పంతో జ్ఞాన శక్తిని పెంపొందించుకుని అనుకున్న పనులను, కోర్కెలను శరన్నవరాత్రుల్లో క్రియాశక్తి ద్వారా సాధించుకోవచ్చున్నారు. బ్రహ్మకుమారీస్‌ అన్ని పండగులు జర్నలిస్టులతో మమైక్మమై జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. విజెఎఫ్‌ కార్యదర్శి ఎస్‌.దుర్గారావు మాట్లాడుతూ ప్రతి పండుగను బ్రహ్మకుమారీలు తమ ద్వారా నిర్వహించడం అభినందనీయమన్నారు. దానివల్ల పండుగల ప్రత్యేకతలు నేటి తరం తెలుసుకునే వెసులుబాటు ఉందన్నారు. ఎంతో మందికి ఆధ్యాత్మిక శక్తిని పంచిపెట్టేది ప్రజాపిత బ్రహ్మాకుమారీలనేని కొనియాడారు. విజెఎఫ్‌ ఉపాధ్యక్షుడు ఆర్‌.నాగరాజు పట్నాయక్‌ స్వాగతం పలికిన ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు ఎంఎస్‌ఆర్‌ ప్రసాద్‌, ఇరోతి ఈశ్వరరావు, బ్రహ్మకుమారీస్‌ రైల్వేన్యూకాలనీ శాఖ ప్రతినిధి శశికళ, విశాలాక్ష్మీనగర్‌ శాఖ ప్రతినిధి రూప,మౌంటాబుకు చెందిన ప్రతినిధి కన్నాలు,ఇతర శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు, తొలుత దసరా పండుగను ప్రతిబింబించే విధంగా గోడపత్రికను ఆవిష్కరించి అందరికీ విజయతిలకం దిద్ది మిఠాయిలు పంపిణీ చేశారు.