అన్నదాన కార్యక్రమంలో నగర మేయర్..
Ens Balu
8
Visakhapatnam
2021-10-11 09:22:38
అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది అని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అన్నారు. సోమవారం ఆమె 3వ జోన్ 23 వ వార్డు పరిధిలోని చైతన్య నగర్ లో దుర్గా దేవి నవరాత్రుల మహోత్సవ ఈ సందర్భంగా వార్డ్ కార్పొరేటర్ గుడ్ల విజయసాయి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నదాన ప్రసాదములను అందించి, దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, నగర అభివృద్ధి జరగాలని, కరోనా నుండి ప్రజలను కాపాడాలని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ సిపి నాయకులు సత్యరెడ్డి, స్థానిక నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.