ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి సోమ వారం నిర్వహించే స్పందన కు 290 వినతులు అందాయి. ఈ వినతులను సంయుక్త కలెక్టర్లు డా. జి.సి.కిషోర్ కుమార్, డి.ఆర్.ఓ గణపతి రావు, స్వీకరించి, సంబంధిత శాఖల అధికారులకు అందజేసారు. సోమవారం రెవిన్యూ కు సంబంధించి 200 దరఖాస్తులు, డి.ఆర్.డి.ఎ కు 48, జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు చెందినవి 18, డి.సి.హెచ్.ఎస్ కు 18 , దరఖాస్తులు అండగా పౌర సరఫరాలకు సంబంధించి 6 దరఖాస్త్హులు అందాయి. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లా శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.