ఆసరా సహాయంతో ఆర్థికంగా బలపడాలి..


Ens Balu
6
Srikakulam
2021-10-11 12:49:03

ఆసరా సహాయం కుటుంబాల ఆర్థిక బలోపేతానికి వినియోగించాలని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కోరారు. నరసన్నపేట నియోజకవర్గం నరసన్నపేట మండలం ఉర్లాం గ్రామ పంచాయతీ ఉన్నత పాఠశాల ఆవరణలో సోమ వారం జరిగిన వైయస్సార్ ఆసరా రెండో విడత నిధులు విడుదల సంబరాలకు ముఖ్య అతిథిగా  డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ హాజరయ్యారు. డిప్యూటీ సీఎం మాట్లాడుతూ వై.ఎస్.ఆర్. ఆశీస్సులు, ఆ దేవుని చల్లని దీవెనలతో దేశంలో అత్యుత్తమ సీఎంలలో జగన్ మూడవ స్థానంలో ఉన్నారన్నారు. రాజకీయాలు అంటే గొప్ప పాలన, పారదర్శకత అనుకునేలా తీర్చిదిద్దారని ఆయన చెప్పారు. పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో గొప్ప చదువులు చదువుకావాలని ముఖ్య మంత్రి ఇంగ్లీష్ మీడియం ను ప్రవేశ పెట్టారని తెలిపారు. పేదల ఇళ్ళు కోసమని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పాతిక వేల కోట్ల రూపాయలతో భూసేకరణ చేసి లక్షలాది కుటుంబాల కళ్ళల్లో ఆనందాన్ని నింపామని చెప్పారు. వైయస్సార్ ఆసరా నిధులను కుటుంబాల ప్రగతి కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం సక్రమంగా వినియోగించుకావాలని ఆయన కోరారు. పలు ప్రైవేటు భాగస్వాములతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని, వాటిలో దేని ద్వారా ప్రయోజనం కలుగుతుందో వాటిని ఎన్నుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు. అందరూ రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుని కరోనా మహమ్మారిని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో అధికార అనధికార ప్రతినిధులు పాల్గొన్నారు.