పురోగతికి మహిళా సారికాధికరత అవసరం..
Ens Balu
1
Srikakulam
2021-10-11 12:50:21
సమాజ పురోగతికి మహిళా సారికాధికరత అవసరమని శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. ఆమదాలవలస మండలం అక్కులుపేట గ్రామంలో సోమ వారం జరిగిన వైయస్సార్ ఆసరా రెండో విడత సంబరాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాసన సభాపతి తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. సభాపతి మాట్లాడుతూ సమాజం పురోగతి సాధించాలoటే మహిళలకు ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలను చేపడుతోందని ఆయన చెప్పారు. ఆసరా కార్యక్రమం క్రింద మహిళా సంఘాలకు ఉన్న రుణాలను నాలుగు విడతల్లో మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగిందని అందులో భాగంగా ఇప్పటికీ రెండు విడతలుగా రుణమాఫీ జరిగిందని ఆయన తెలిపారు. విద్యార్థులు చదువుల నిమిత్తం అమ్మ ఒడి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని విద్యా దీవెన, వసతి దీవెన తో మరింత సహాయ సహకారాలు అందిస్తున్నారని ఆయన చెప్పారు. రైతు భరోసా కార్యక్రమం క్రింద రైతులకు ఏడాదికి 13,500 రూపాయలు చెల్లిస్తున్న ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి అని ఆయన పేర్కొన్నారు. వాహనమిత్ర , జగనన్న తోడు, వైయస్సార్ ఆరోగ్యశ్రీ తదితర కార్యక్రమాలను అమలు చేస్తూ అభివృద్ధి సంక్షేమం దిశగా కొనసాగుతున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి బెoడి గోవిందరావు, బొడ్డేపల్లి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.